మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన

మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన

విశ్వంభర, చండూర్ :-కిషోర్ హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరమునకు అపూర్వ స్పందన లభించింది. అభయ బ్లడ్ బ్యాంకు హైదరాబాద్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం చండూరు మండలం దోనీపాముల గ్రామంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దోనిపాముల గ్రామ సర్పంచ్ దాసరి అలివేలు స్వామి హాజరై ప్రారంభించారు. వీరితో పాటు వార్డు మెంబెర్స్ శ్రవణ్, కొండపల్లి నర్సింహా, ఆలేటి లక్ష్మి అయోధ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ కిషోర్ హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానం కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం అని అన్నారు. అలాగే ఈ సంస్థ వారు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని అన్నారు. కిషోర్ హెల్పింగ్ సంస్థ నిర్వాహకులు కర్నాటి కిరణ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రమాదాల కారణంగా గాని, శస్త్ర చికిత్సల కోసం గాని రక్తం దొరకక చాలామంది చనిపోతున్నారని అలాంటి వారి కోసం కిషోర్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆరు సంవత్సరాలలో దాదాపు 25 కు పైగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఒక వెయ్యి మందికి పైగా రక్తదానం చేసారని అన్నారు.ఈ కార్యక్రమంలో యువకులు, స్థానికులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/unprecedented-response-to-mega-blood-donation-camp/article-18555

Tags: