దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలి

విశ్వంభర, హైదరాబాదు : దళితుల హక్కుల పరిరక్షణతో పాటు అసమానతలు, అంటరానితనం, కుల వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలను బలోపేతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ఆహార భద్రతను బలోపేతం చేయాలని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల హక్కులను కాపాడే విధానాలు అమలు చేయాలని కోరారు. కుల వివక్ష, అంటరానితనం, అట్టడుగు వర్గాలపై దాడులను అరికట్టేందుకు సమష్టి ఉద్యమాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/movements-for-dalit-rights-should-intensify/article-18533

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు