ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఎన్జీవో అర్మాన్ సొసైటీ ఆధ్వర్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్  అధ్యక్షతన “ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీని గుర్తించుటపై”  శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నెల్లికుదురు, దంతాలపల్లి, బయ్యారం, గంధం పల్లి, గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గల ఏఎన్ఎంలకు గర్భిణీ స్త్రీ ప్రమాదకర లక్షణాలపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మాట్లాడుతూ అర్హులైన దంపతులలో గర్భిణీ స్త్రీలను మూడు నెలల లోనే నమోదు చేయడం, 35 సంవత్సరాలు పైబడిన స్త్రీలు, కవల పిల్లల గర్భం ఉన్నట్లయితే, తరచుగా గర్భ స్రావాలు, గర్భధారణలో రక్తస్రావము, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, గర్భిణీ స్త్రీ దీర్ఘకాల వ్యాధులతో, గర్భిణీ స్త్రీ బరువు అధికంగా ఉన్న మరియు తక్కువగా ఉన్న వారిని గుర్తించాలని, మొదటి మూడు నెలల గర్భిణీ స్త్రీ మెడికల్ ఆఫీసర్ ద్వారా స్క్రీనింగ్ (పరీక్ష )చేయించి, రక్త పోటు, మూత్ర పరీక్ష, డయాబెటిస్ తెలుసుకోవడానికి రక్త పరీక్ష,  అల్ట్రాసౌండ్ పరీక్షలు, బిడ్డ గుండె చప్పుడు ఎదుగుదల పరిశీలించడం ద్వారా గుర్తించి పై లక్షణాల్లో ఉన్న యెడల ప్రభుత్వ జనరల్ హాస్పటల్ కు రిఫర్ చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఏఎన్ఎం లకు సూచించి జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా చూడాలని తెలియజేస్తూ, ఎక్స్పెక్టెడ్ డెలివరీ లిస్టు ప్రకారము గర్భిణీ స్త్రీని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు జరుగునట్లు ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాతా శిశు సంరక్షణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విరాజిత, హెచ్ ఈ ఓ లోక్య, ఎన్జీవో ఆర్గనైజర్ మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/training-program-for-staff-in-primary-health-centres/article-18490

Tags: