పాలిటెక్నిక్ కళాశాలలో ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విశ్వంభర, కేసముద్రం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేసముద్రం శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. శాఖ అధ్యక్షుడు చిత్తరి చాణక్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు ముంజంపల్లి దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల సాధన, జాతీయ భావాల పరిరక్షణ కోసం ఏబీవీపీ 78 ఏళ్లుగా కృషి చేస్తోందన్నారు. కళాశాలల్లో మౌలిక వసతులు, ఉపకార వేతనాలు, సంక్షేమ వసతి గృహాల సమస్యలపై ఉద్యమాలు చేపట్టి విద్యార్థుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. జాతీయత, దేశభక్తి భావాలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఏబీవీపీ లక్ష్యమని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది జూలై 9ను జాతీయ విద్యార్థి దినోత్సవంగా నిర్వహించడం ఏబీవీపీ ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాణక్య, ముకేశ్, గణేష్, సురేందర్, నవీన్, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు