విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయండి 

విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయండి 

విశ్వంభర, నారాయణగూడ : విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కెజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతుగా గురువారం  వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాదు నారాయణగూడ లో ప్రదర్శన నిర్వహించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రతిపాదనను విరమించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గురుకులాలకు నిధులు కేటాయించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి. నాగరాజు,పుట్టా లక్ష్మణ్, ఎస్. అనిల్, పి. మహేష్,పల్లె మురళి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/make-the-bandh-of-educational-institutions-successful/article-18467

Tags: