ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి: ఐద్వా

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకురావాలి, విద్యను వ్యాపారంగా మార్చే విధానాన్ని అడ్డుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఐద్వా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు పాఠశాలలు పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రిని బలవంతంగా కొనుగోలు చేయించే విధానాన్ని నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, విద్యారంగానికి తగిన నిధులు కేటాయించడం, మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను విస్తృతం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, పి. ప్రభావతి, బండి పద్మ, నాగలక్ష్మి, ఎన్. రత్నమాల, కె. గీతా రాణి, ఎం. వినోద, డి. అనసూయ, పి. శశికళ, వై. వరలక్ష్మి పాల్గొన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/law-tevali-aidwa-to-regulate-the-fees-of-private-schools/article-18471

Tags: