రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

WhatsApp Image 2026-07-10 at 9.46.25 PM (1)విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీసు శాఖలో కనీసం 20 వేల పోస్టులతో నియామకాలు చేపట్టాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ లైబ్రరీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిరుద్యోగ యువతతో సమావేశమైన ఆయన, వారి సమస్యలపై వినతిపత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేయాలని కోరారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, జూనియర్, డిగ్రీ లెక్చరర్లతో పాటు అన్ని శాఖల్లో నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి హామీ ఇచ్చిన రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జూలై 15న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సీపీఎం రాష్ట్రస్థాయి నిరుద్యోగ ధర్నాను విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా. ఆర్.ఎల్. మూర్తి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, డీబీఎస్‌ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ దర్శన్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌యూ నాయకులు, సీపీఎం నగర నాయకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/notification-should-be-released-for-two-lakh-jobs/article-18539

Tags: