వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ
విశ్వంభర, ఇనుగుర్తి: బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు ఎంపీ వద్దిరాజు నిధులతో మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన వడ్డెర సామాజిక వర్గ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వడ్డెర కులస్తులు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి సమిష్టి సమావేశాల కోసం మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ₹.4 లక్షల 99 వేలను వడ్డెర కమ్యూనిటీ భవనం కోసం మంజూరు చేశారన్నారు.ఈ ప్రాంత అభివృద్ధికి ఎంపీ రవిచంద్ర నిరంతరం పాటుపడడం అభినందనీయం అన్నారు.ఈ సందర్భంగా వడ్డెర సామాజిక వర్గం నాయకులు ప్రతినిధులు రవిచంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ తో పాటు వడ్డెర కుల సంఘం నాయకులు పాల్గొన్నారు