ఎస్ ఐ ఆర్. పేరుతో ఏ ఒక్క నిజమైన ఓటును  తొలగించొద్దు

  •  సిపిఎం డిమాండ్

విశ్వంభర, వలిగొండ:  యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకమైనదని ఎస్ ఐ ఆర్  పేరుతో ఏఒక్క నిజమైన ఓటును తొలగించొద్దని ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్ లు అన్నారు.  శుక్రవారం రోజున ఎస్ ఐ ఆర్.పామ్స్ ను నింపే విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూసేందుకు వలిగొండ పట్టణంలో 2వ వార్డు లో సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరునికి  ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని నేడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్. పేరుతో ఓటర్ల జాబితా నుండి ఏ ఒక్క ఓటును కూడా తొలగించకుండా ఎన్నికల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలో 8పోలింగ్ బూత్ లలో అనేక కుటుంబాలకు చెందిన వారి ఓట్లు గల్లంతు అయ్యాయని దీనితో కొందరికి ప్రభుత్వం ఇస్తున్న ఎస్ ఐ ఆర్. పారాలు అందక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .  ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉండ్రాటి పాపయ్య,కాలనీ ప్రజలు బొల్లు రమేష్, పలుసం భాస్కర్,అంజమ్మ,పద్మ,తదితరులు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/do-not-remove-any-genuine-vote-in-the-name-of/article-18545

Tags: