ఏట్ల ఎర్రవల్లి ప్రజాప్రతినిధుల జన్మదిన వేడుకలు - ఘనంగా.. ప్రముఖుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
షాబాద్, విశ్వంభర:షాబాద్ మండల పరిధిలోని ఏట్ల ఎర్రవల్లి గ్రామ ఉపసర్పంచ్ కుమ్మరి వేణుగోపాల్ మరియు మాజీ వార్డ్ సభ్యుడు ఎండి ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు నాగర్‌గూడ గ్రామంలోని పీఎస్ఆర్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు పిసరి సతీష్ రెడ్డి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి, శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకర నర్సింలు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి