ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది

విశ్వంభర, రామన్నపేట: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఏ ఒక్కరి ఓటు కూడా కోల్పోకుండా చూసే బాధ్యత మన అందరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి  తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో జరుగుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి మండల ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రతి ఓటరు హక్కును కాపాడేందుకు ఉద్దేశించినదని, మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని తెలిపారు. పేర్లు తొలగిపోయినా, కొత్తగా చేర్పించుకోవాల్సిన వారు ఉన్నా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి" అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కల్పించాలని, ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నామని గంగుల వెంకటరాజిరెడ్డి అన్నారు

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-vote-counts-in-a-democracy/article-18531

Tags: