ఇమాంపేట ఆదర్శ పాఠశాల ను ఆకస్మిక తనిఖీ

ఇమాంపేట ఆదర్శ పాఠశాల ను ఆకస్మిక తనిఖీ

  •  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ 

  విశ్వంభర, సూర్యాపేట: ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు విడతలవారీగా జరుగుతున్న జిల్లా స్థాయి వృత్యంతర శిక్షణా కార్యక్ర మాల పర్యవేక్షణలో భాగంగా  ఆదర్శ పాఠశాల ఇమాంపేట నందు భౌతిక శాస్త్ర మరియు హిందీ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్నిజిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ తేజస్ నందలాల్ పవార్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ సి ఈ ఆర్ టీ  వారిచే క్వాలిటీ లెర్నింగ్ త్రు ట్రాన్స్ఫర్ మేటివ్ ప్రాక్టీసెస్ అనే థీమ్ తో రూపొందించబడిన ఈ శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకొని విద్యా బోధనలో డిజిటల్ లిటరసీ, ఏఐ వంటి వాటిని సమ్మిళితం చేసి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ద్వారా సమర్థవంతమైన బోధన కావించాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా తగిన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. జాతీయస్థాయిలో నిర్వహించే పర్ఫామెన్స్ గ్రేడ్ ఇండెక్స్ లో సూర్యాపేట  324/600 పాయింట్లతో ప్రచేష్ట-1 స్థాయిని పొంది రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచిందని , ఈ విద్యా సంవత్సరంలో మొదటి వరుస స్థానంలో నిలిచే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల  అభ్యసన స్థాయిల ఆధారంగా ప్రతి ఉపాధ్యాయుడు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి ఏలే హరికృష్ణ మరియు భౌతిక శాస్త్ర, హిందీ జిల్లా రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-surprise-inspection-of-imampeta-adarsh-school/article-18536

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు