వివరాలు పక్కాగా నమోదు చేయాలి 

వివరాలు పక్కాగా నమోదు చేయాలి 

  •  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

విశ్వంభర, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం పట్టణంలోని 40వ వార్డులో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి, సర్వే జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. వార్డులోని ఇళ్లకు వెళ్లిన కలెక్టర్.. ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తున్న విధానాన్ని దగ్గరుండి గమనించారు. ఒక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన, వారికి ఎన్యుమరేషన్ ఫామ్‌ను స్వయంగా అందజేశారు. సర్వేలో భాగంగా అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ సహకరించి, సరైన సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఎన్యుమరేటర్లను, సూపర్వైజర్లను కలెక్టర్ ఆదేశించారు.  ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సర్వే చేయాలని,  ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కావద్దని సూచించారు. డేటా ఎంట్రీలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన సమయంలోగా సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  కార్యక్రమాలు ఆర్డీవో వేణుమాధవరావు, డిప్యూటీ తాసిల్దార్ లాలు బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-details-should-be-entered-correctly/article-18478

Tags: