కనుమరుగవుతున్న మోడల్ స్కూల్ వెళ్లే కాలి బాట  

విశ్వంభర , వలిగొంకూడ: యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండల పరిధిలో ఎమ్మార్వో ఆఫీస్ వెనుక ఉన్న మోడల్ స్కూల్ కు వెళ్లే కాలి బాట రోజు రోజుకు కనుమరుగవుతోంది. వర్షాలకు బురద, ముళ్ల పొదలతో ఈ బాట పూర్తిగా శిథిలమైంది. ఈ బాటను వందలాది మంది విద్యార్థులు ప్రతి రోజూ స్కూల్ కు వెళ్లడానికి ఉపయోగిస్తున్నారు. దారి సరిగా లేకపోవడంతో విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. బురదలో పడిపోతూ, బ్యాగులు తడుస్తూ స్కూల్ కు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు, స్థానిక నాయకులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే  వెంటనే స్పందించి ఈ బాటపై.సిసి రోడ్డు వేయించాలని, దీని వల్ల విద్యార్థుల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సురక్షితంగా స్కూల్ కు చేరుకుంటారని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/disappearing-footpath-to-model-school/article-18500

Tags:  

Advertisement

LatestNews

పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు
సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. 5 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు