హుస్నాబాద్‌ను వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం
- ఆయిల్ ఫామ్ సాగు పెంచే గ్రామ పంచాయతీ లకు ప్రోత్సాహకాలు
- టామ్ కాం ద్వారా విదేశాల్లో లక్షల జీతాలతో ఉద్యోగాలు నైపుణ్యాలు సాధించి యువత ఉద్యోగాలు సాధించాలి
హుస్నాబాద్‌ను తెలంగాణలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం - మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకట్ స్వామి
విశ్వంభర, హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనగామలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్, తోటపల్లిలో రూ.45.15 కోట్ల వ్యయంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణానికి భూమిపూజ, టామ్‌కాం ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగ మేళా, ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్‌ను వ్యవసాయం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం 14 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే గ్రామాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందజేస్తామని తెలిపారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ATC ద్వారా రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఐఓటీ వంటి ఆధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2 వేల స్టైపెండ్ అందజేస్తామని చెప్పారు. టామ్‌కాం ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాకు సుమారు 1,500 మంది యువత నమోదు చేసుకున్నారని, జర్మనీ సహా పలు దేశాల్లో ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. జర్మన్ భాషా శిక్షణకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టామ్‌కాం ద్వారా దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం పెంపొందించుకుంటే విదేశాల్లో లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ క్రాంతి వెస్లీ, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.