ఐఎన్టీయుసీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొమ్మిడి ఇంద్రారెడ్డి నియామకం 

విశ్వంభర, హైదరాబాద్ : భారత జాతీయ కార్మిక యూనియన్ కాంగ్రెస్  తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొమ్మిడి ఇంద్రారెడ్డి ని నియమిస్తూ ఐఎన్టీయుసీ జాతీయ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డి శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. జి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం, సంస్థ బలోపేతం, ఐఎన్టీయుసీ సిద్ధాంతాల విస్తరణ కోసం అంకితభావంతో పనిచేయాలని ఇంద్రారెడ్డి కి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తూ, సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసీ జాతీయ ఉపాధ్యక్షులు, ఐ ఎల్ ఓ మెంబెర్ సత్యజిత్ రెడ్డి , ఐఎన్టీయుసీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్, టిజేఈయూ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , ఇతర ముఖ్య నాయకులు, కంచర్ల సత్య రెడ్డి గుత్తా సీతారామ రెడ్డి, కొంతల్ రెడ్డి పాల్గొని  కొమ్మిడి ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kommidi-indra-reddy-appointed-as-intuc-telangana-state-organizing-secretary/article-18504

Tags: