చేనేత సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
- చేనేత సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని చేనేత సహకార సంఘాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన అధ్యక్షులను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అభినందించారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో హుస్నాబాద్ మండలం చెర్లతోటపల్లి శ్రీ లక్ష్మీ హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ అధ్యక్షుడిగా గాజుల భగవాన్ నేత, పొట్లపల్లి హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ అధ్యక్షుడిగా సబ్బని వెంకటేశం, కోహెడ మండలం శ్రీరాములపల్లి హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ అధ్యక్షుడిగా పత్తిపాక రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చేనేత రంగం రాష్ట్రానికి గర్వకారణమని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. నూతన అధ్యక్షులు సంఘాల అభివృద్ధితో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.