గుండాలలో  విద్యాసంస్థల బంద్ విజయవంతం 

గుండాలలో  విద్యాసంస్థల బంద్ విజయవంతం 

విశ్వంభర, గుండాల: విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గుండాల మండలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ గుండాల మండల అధ్యక్షుడు ధార సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకే కుదించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని తక్షణమే నియమించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థలకు కాకుండా మహిళా సంఘాల ద్వారానే అమలు చేయాలని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ.) నంబర్లు 7, 8, 9లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ గుండాల మండల కార్యదర్శి మహ్మద్ ఇర్ఫాన్, ఉపాధ్యక్షుడు పందుల ప్రేమ్ కుమార్, నాయకులు ఉప్పుల ఉదయ్, అన్నెపర్తి యాకస్వామి, శాగంటి సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-strike-of-educational-institutions-in-gunda-was-successful/article-18552

Tags: