దూర గ్రామాలను హుస్నాబాద్ మండలంలో విలీనం చేయాలి..!
- హుస్నాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్‌చెరువు తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ధర్మారం, మల్‌చెరువు తండా, రేగొండ, గోవర్ధనగిరి, గౌరవెల్లి, జనగామ, చౌటపల్లి గ్రామాలను అక్కన్నపేట మండలం నుంచి తొలగించి సమీపంలోని హుస్నాబాద్ మండలంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి హుస్నాబాద్ మండలానికి చెందిన ఈ గ్రామాలను మండలాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్కన్నపేట మండలంలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే 15 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోందని, ప్రజల సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గ్రామాలను దూర ప్రాంత మండలంలో కలిపారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఈ గ్రామాలను హుస్నాబాద్ మండలంలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని గుర్తు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ గ్రామాలను హుస్నాబాద్ మండలంలో విలీనం చేస్తామని అప్పటి అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రజలకు హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తవుతున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వం, మంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి సంబంధిత గ్రామాలను హుస్నాబాద్ మండలంలో విలీనం చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు భూక్యా విట్టల్, గుగులోతు శంకర్, అయిలేని గాల్ రెడ్డి, బానోత్ సంతోష్, రంగన్న, భూక్యా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.