భూదార్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

భూదార్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

  • – జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూముల హద్దులను కచ్చితంగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన భూదార్ (భూభారతి) సర్వేను అధికారులు వేగంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. డోర్నకల్ మండలంలోని గుర్రాలకుంట, బూర్గంపాడు, ముల్కలపల్లి, బొద్దుగొండ గ్రామాల్లో జరుగుతున్న భూదార్ సర్వేను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. గుర్రాలకుంట గ్రామ సరిహద్దులను రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించి, మ్యాప్ ద్వారా సరిహద్దుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీజీపీఎస్, రోవర్స్ సాంకేతికతతో గ్రామ సరిహద్దులను ఖచ్చితంగా గుర్తిస్తున్నామని, సర్వే పూర్తైన తర్వాత ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్) కేటాయించనున్నట్లు తెలిపారు. భూముల హద్దులు స్పష్టంగా నిర్ధారణ కావడంతో పాటు ప్రభుత్వ భూముల వివరాలు కూడా స్పష్టతకు వస్తాయని చెప్పారు. సర్వే ప్రక్రియలో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు పొరుగు రైతులకు సమాచారం, నోటీసులు అందించాలని అధికారులకు సూచించారు. ఖచ్చితమైన బౌండరీ మ్యాపింగ్ వల్ల భవిష్యత్తులో భూ ఆక్రమణలు, వివాదాలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డీవో రాజేశ్వరి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, డోర్నకల్ తహసీల్దార్ రఘువీరారెడ్డి, లైసెన్స్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-bhudar-survey-should-be-conducted-in-an-armed-manner/article-18550

Tags: