హుస్నాబాద్‌లోనే టీచర్ల శిక్షణా తరగతులు నిర్వహించాలి

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌కు డీటీఎఫ్ వినతి

విశ్వంభర, హుస్నాబాద్ : జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలను హుస్నాబాద్ డివిజన్‌లోనూ ఏర్పాటు చేయాలని కోరుతూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) సిద్దిపేట జిల్లా నాయకులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలు కేవలం సిద్దిపేట, గజ్వేల్ డివిజన్లలో మాత్రమే నిర్వహిస్తున్నారని, దీంతో హుస్నాబాద్ డివిజన్‌కు చెందిన ఉపాధ్యాయులు శిక్షణ కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రిసోర్స్ పర్సన్లను హుస్నాబాద్‌కు పంపించి ఇక్కడే శిక్షణా తరగతులు నిర్వహిస్తే ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగడంతో పాటు సమయం, ప్రయాణ వ్యయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ డివిజన్‌ను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఇక్కడే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ వి. వెంకటరమణారెడ్డి, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బి. ప్రభాకర్ రెడ్డి, హుస్నాబాద్, అక్కన్నపేట మండల ప్రధాన కార్యదర్శులు పి. సంపత్ రెడ్డి, ఏ. మల్లయ్య తదితరులు ఉన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/teacher-training-classes-should-be-conducted-in-husnabad-itself/article-18512

Tags: