ఎస్‌ఐఆర్ సవరణపై ప్రజల్లో చైతన్యానికి సాంస్కృతిక సారథి కళాకారుల అవగాహన ప్రదర్శనలు
విశ్వంభర, మహబూబాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డీపీఆర్వో) రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో పాటలు, రూపకాల ద్వారా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, అందిన ఫారాల డిజిటలైజేషన్‌కు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు), సూపర్వైజర్లు, ఎన్నికల సిబ్బంది పక్కా ప్రణాళికతో ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు. ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని బీఎల్‌ఓలు ఫారం-6 డిక్లరేషన్‌తో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో 267 మంది, మహబూబాబాద్ నియోజకవర్గంలో 288 మంది బీఎల్‌ఓలు, మొత్తం 555 మంది బీఎల్‌ఓలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు 56 మంది సూపర్వైజర్లు, 12 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్‌ఓలు), ఇద్దరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓలు) ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని వివరించారు. సర్వేకు వెళ్లే సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డు, క్యాప్, అవసరమైన మెటీరియల్‌తోనే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం నింపేందుకు, అలాగే 2002 ఓటరు జాబితాలో పేరు పరిశీలించేందుకు voters.eci.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించారు. ఎస్‌ఐఆర్ సవరణ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని కోరారు. అలాగే జిల్లాలో ఎస్‌ఐఆర్, మ్యాపింగ్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మిట్టగడుపుల భరత్, ఐలేష్ కుమార్, ఇతర బృంద సభ్యులు పాల్గొన్నారు.