సీబీఎస్ సిలబస్ పేరుతో దోపిడీ చేసిన డబ్బును తిరిగి విద్యార్థులకు ఇవ్వాలి 

విశ్వంభర, అనంతపురం :  అనంతపురం నగరంలోని ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాలలో సిబిఎస్ సిలబస్ లేకపోయినా సిబిఎస్ సిలబస్ ఉందంటూ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను దోచుకుంటున్న శ్రీ చైతన్య విద్యాసంస్థ పై చర్యలు తీసుకోవాలంటూ కొడవండ్ల నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై రిలే నిరాహార దీక్షకు నేను సైతం సిద్ధమంటూ రిలే నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్న నరేష్ కొడవండ్ల శ్రీ చైతన్య విద్యాసంస్థల యజమాన్యం విద్యార్థుల నుంచి దోచుకున్న డబ్బును తిరిగి విద్యార్థులకు ఇవ్వాలన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల రూపంలో మధ్యతరగతి విద్యార్థుల రక్తం తాగుతున్నాయన్నారు. అంతేకాకుండా మధ్యతరగతి విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో చదువుకోవాలంటే ఇల్లు వాకలి అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ కళాశాల మెడలు వంచి ఫీజులు తగ్గించాలంటూ హెచ్చరించారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-money-looted-in-the-name-of-cbs-syllabus-should/article-18541

Tags: