విద్యార్థినులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం : అరవింద్ కుమార్ యాదవ్

విశ్వంభర, ముషీరాబాదు : ముషీరాబాదు మైనార్టీ గురుకుల హాస్టల్ విద్యార్థినులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం హైదరాబాదు ముషీరాబాదు గురుకుల హాస్టల్‌ను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాభ్యాసం, వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలపై వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. విద్యతోనే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ ప్రగతి సాధ్యమవు తుందని, ప్రతి విద్యార్థిని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హాస్టల్‌కు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగ్ లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోకేష్ యాదవ్, అంజి యాదవ్, నరేందర్, బబ్లు, ప్రేమ్ కుమార్, నరేష్, శ్రీకర్ పాల్గొన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/arvind-kumar-yadav-will-provide-all-facilities-to-girl-students/article-18459

Tags: