ఆరుట్లలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

  • -పాల్గొన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి

విశ్వంభర,ఇబ్రహీంపట్నం:- రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మణికంఠుడి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అయ్యప్ప స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ కమిటీ చైర్మన్ సత్తు వెంకట రమణా రెడ్డి, మంచాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షలు చీరాల రమేష్, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ayyappa-swami-statue-honoring-mahotsava-in-arutla/article-18508

Tags: