మెట్ట పంటలకు ప్రోత్సాహకం ఇవ్వాలి
విశ్వంభర, సూర్యాపేట : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వరికి ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.8 వేల ప్రోత్సాహకం అందించి, మెట్ట పంటలన్నింటికీ గిట్టుబాటు ధరకు హామీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశంలో దొడ్డ వెంకటయ్య అధ్యక్షతన ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు. నకిలీ విత్తనాల సమస్యతో పాటు పత్తి విత్తనాల మొలక శాతం తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. మెట్ట పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచి, పంటల మార్పిడిని ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూలై 18, 19, 20 తేదీల్లో యాదగిరిగుట్టలో రాష్ట్రస్థాయి రైతు శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మేళ్లచెరువు మండలంలోని 1057 సర్వే నంబరు భూములపై సమగ్ర సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని, మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: రైతు సంఘం సీనియర్ నాయకుడు ఎం. వెంకటేశ్వర్లు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు తిపిరాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు హన్నెం పాపిరెడ్డి, జక్కుల రమేష్, చెన్నగాని సైదులు, పొనుగుపాటి వాసుదేవరావు, ముడెం ధనరాజు రెడ్డి, పోకల ఆంజనేయులు, కుందూరు వెంకట్ రెడ్డి, మామిడి చిన్న రామయ్య, రవీందర్ రెడ్డి, యేసు, సారెడ్డి పాపిరెడ్డి, ముక్క వీరబాబు పాల్గొన్నారు.