అంబర్‌పేటలో యువకుడు ఆత్మహత్య

అంబర్‌పేటలో యువకుడు ఆత్మహత్య

విశ్వంభర, అంబర్‌పేట : హైదరాబాదు అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీహెచ్‌ఎంసీలో శానిటేషన్ కార్మికుడిగా పనిచేస్తున్న ఎం. నిఖిల్ కుమార్ (25) తన నివాసంలో బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కుటుంబ సభ్యులకు కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించి ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుడికి మద్యం అలవాటు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/youth-committed-suicide-in-amberpet/article-18486

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి