మహబూబాబాద్‌లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

  • : సీనియర్ న్యాయవాదులకు సన్మానం

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్( మనుకోట ) న్యాయవాది పరిషత్ విభాగం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని సీనియర్ న్యాయవాదుల సన్మాన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. మహబూబాబాద్( మనుకోట ) న్యాయవాది పరిషత్ విభాగం అధ్యక్షుడు, నలుసాని ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ఎం.ఆర్. సునీత, హాజరుకాగా, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. శాలిని , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, మరియు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ. కృష్ణ తేజ,  అతిథులుగా పాల్గొన్నారు; వారు సీనియర్ న్యాయవాదులను జ్ఞాపిక మరియు సంప్రదాయ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ఎం.ఆర్. సునీత మాట్లాడుతూ న్యాయ ప్రముఖులు అందించిన జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు అమూల్యమైన సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ పవిత్రమైన రోజని, సమాజంలో న్యాయాన్ని రక్షించడంలో మరియు యువ న్యాయవాదులను తీర్చిదిద్దడంలో సీనియర్ల పాత్ర ఎనలేనిదని వారు పేర్కొన్నారు.  గౌరవనీయ సీనియర్ న్యాయవాదులు ఎన్. వి. చలపతి రావు , బి. రవీంద్ర గుప్తా, మేక సురేష్ రెడ్డి ,కొండబత్తుల యాదగిరి,ఎ. ప్రేమచందర్, తోర్నాల నాగేశ్ కుమార్, ప్రొద్దుటూరు రవికుమార్, జి. వై. గిరి లను ఈ రోజున సన్మానించుకోవడం మన బాధ్యత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని సీనియర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో న్యాయవాది పరిషత్ ఉపాధ్యక్షుడు గాధే కమల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పుల్లఖండం శ్రీనివాస స్వామి,కోశాధికారి పిన్ని రాము, న్యాయవాదులు కొంపెల్లి వెంకటయ్య ,డేగల సత్యనారాయణ, గంధసిరి ఉప్పలయ్య ,కాలేరు శ్రీనివాస్ , బి. ఆనంద్ కుమార్ , బొనగిరి అమర్ నాథ్ గుప్తా ,ఆర్. రఘునాథ రావు దూదిమట్ల మహేందర్, కొర్ర మున్నా, దర్శనం రామకృష్ణ ,బి.శ్రీనివాస్, కాసాని మౌనిక, బొద్దుల దేవి, వాసం ఆనంద్‌కుమార్ ,నీరటి రాజమణి , సూర్ణపాక ​​హరిబాబు ,బి. బాలాజీ , సుమన్ యు.ఉమామహేశ్వర్ రావు, చిట్యాల నరేష్, చల్లా అశోక్, ఉగ్గుల అశోక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grand-full-moon-celebrations-in-mahabubabad/article-18547

Tags: