అంతర్జాతీయ స్థాయి ఎగుమతి హోల్ సేల్ చేపల మార్కెట్ కు శంకుస్థాపన 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ ప్రాంతంలో రూ. 47.03 కోట్ల భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ఎగుమతి హోల్ సేల్ చేపల మార్కెట్నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవానికి గౌరవ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మత్స్యకారులకి చెక్కుల పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం వెనుకబడిన వర్గాల, ముఖ్యంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి కట్టుబడి ఉంది. కోహెడలో ఏర్పాటు కాబోతున్న ఈ అత్యాధునిక హోల్ సేల్ మార్కెట్ ద్వారా మత్స్యకారులకు దళారీల శ్రమ లేకుండా, తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తుంది. జాతీయ మత్స్యకారుల దినోత్సవానికి ముందే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం సంతోషకరం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకా మధుసూదన్ రెడ్డి, మత్స్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరేట్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో మత్స్యకార సొసైటీల  ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/laying-foundation-for-international-level-export-wholesale-fish-market/article-18516

Tags: