ప్రభుత్వ పాఠశాలల సాంకేతిక విద్యకు సహకారం అభినందనీయం

  • ప్రభుత్వ పాఠశాలలకు ఇన్ఫోసిస్ 80 కంప్యూటర్ల వితరణ

విశ్వంభర,తొర్రూరు:  గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ముందడుగు వేస్తూ కంప్యూటర్లను అందజేయడం అభినందనీయమని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు ఇన్ఫోసిస్ సంస్థ సిఎస్ఆర్ విభాగం హైదరాబాద్ సోనీయంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సంయుక్త ఆధ్వర్యంలో తొర్రూరు, పెద్దవంగర మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 80 కంప్యూటర్ల వితరణజేసే కార్యక్రమం తొర్రూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు  మామిడాల యశస్విని  రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొంటూ ఇన్ఫోసిస్ మరియు లయన్స్ క్లబ్‌ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేయాలనే ఈ మహత్తర కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ రాపాక స్వాతి, కోఆర్డినేటర్  రాపాక నాగరాజు  విశేష కృషి చేసి కంప్యూటర్లను సమకూర్చటం అభినందనీయమని అన్నారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేస్తున్న వారి సేవలను కొనియాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ వసతులు పెరగడం వల్ల గ్రామీణ విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా అభ్యసించే అవకాశం లభిస్తుందని, తద్వారా వారి ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు , ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ సోమ రజని లైన్స్ క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి ఎంఈఓ బుచ్చయ్య జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ బాధ్యురాలు ఎస్ నాగవాణి వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ తక్కలపల్లి రవీంద్ర లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎన్. కృష్ణమూర్తి, పి. వెంకటేశ్వర్ రెడ్డి, ఎం. రమణ రెడ్డి, ప్రోగ్రామ్ చైర్మన్ టి. ఉపేందర్ రావు, కో-చైర్మన్ గంజి విజయ్‌పాల్ రెడ్డి, పెద్దవంగర ఎంఈఓ బుధవారం శ్రీనివాస్ తమ్మి శోభా ఉపేందర్ లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు  పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/contribution-to-technical-education-of-public-schools-is-commendable/article-18463

Tags: