జర్నలిస్టులకు ఆర్టీసీ బయాణం కల్పించాలి స్సులలో ఉచిత ప్ర
- - సూర్యాపేట జిల్లా డిపో మేనేజర్ వి. సునీత కి వినతి
- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు
విశ్వంభర,సూర్యాపేట: జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం బస్ పాస్ లు ఇవ్వాలని శుక్రవారం సూర్యాపేట జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట డిపో మేనేజర్ వి. సునీత ని కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్వాయి జానయ్య, ముషం హరిప్రసాద్ లు మాట్లాడుతూ , రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఆర్ టిసి బస్ లో ఉచితంగా ప్రయాణం చేసేవిధంగా చర్యలు తీసుకోవలన్నారు. జర్నలిస్ట్ లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్నారు. తెలంగాణ లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాదిరిగానే జర్నలిస్ట్ లందరికి అలాంటి విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ చాలా ఏళ్ళుగా మాయొక్క జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో 1/3 రాయితీ పై ప్రయాణం మాత్రమే కాకుండా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా ప్రయాణం సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 1/3 చార్జీలు అంటూ కోర్రీలు పెట్టి జర్నలిస్ట్ లతో దాదాపు 50% చార్జీలు వసూలు చేసే విధానాన్ని స్వస్తి పలకాలని కోరారు . నేడు జర్నలిస్ట్ లకు యాజమాన్యం ఏమాత్రం జీతాలు లేకుండా ప్రజా సేవలో ప్రభుత్వంకు మరియు ప్రజలకు అనుసంధానం తో వార్తల ప్రచురణ కోసమే ఆర్ టిసి లో ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులకు ఈ 1/3 చార్జీలు భరించలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ...మా కొద్దిమంది జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరం. కావున దయచేసి జర్నలిస్టులకు అన్ని అర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు ఎస్కే పాషా, ప్రసాద్, మోహన్ రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.