కులగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్‌లు కేటాయించాలి
- : టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్
విశ్వంభర, బషీర్ బాగ్ : దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించి జనగణన నిర్వహించాలని బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనిక్ కోడ్‌లు లేకుంటే 2011 సామాజిక-ఆర్థిక కులగణనలో ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతమై కులగణన విశ్వసనీయత దెబ్బతింటుందని అన్నారు. ఒకే కులం వివిధ పేర్లతో నమోదై డూప్లికేషన్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ 2024 కుల సర్వే, బీహార్ కులగణనలో అమలు చేసిన కోడ్ విధానాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని సూచించారు. అలాగే జనగణన ప్రశ్నావళిలో సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ అంశాలకు సంబంధించిన కొత్త ప్రశ్నలు చేర్చి, తుది ప్రశ్నావళి ఖరారు చేసే ముందు ప్రజా సంఘాలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని కేంద్రాన్ని కోరారు. ఆల్ ఇండియా బీఎస్పీ కన్వీనర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు దశాబ్దాలుగా బీసీలను మోసం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుత కులగణన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శిస్తూ, కులగణనను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు మాట్లాడుతూ బీజేపీ బీసీ ఎంపీలు, వెంటనే స్పందించి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించేలా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కులగణన శాస్త్రీయంగా, వృత్తిపరమైన ప్రమాణాలతో జరగాలంటే యూనిక్ కోడ్ వ్యవస్థ తప్పనిసరి అని అన్నారు. ఈ సమావేశానికి దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించగా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎర్రమాద వెంకన్న, చెన్న శ్రీకాంత్ ,సింగం నాగేశ్వర్ గౌడ్,కొండల్ గౌడ్,లింగేశ్ యాదవ్, జెల్ల నరేందర్,భిక్ష పతి , నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.