ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి 

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి 

  • గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను పెంచుకోవాలి
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

విశ్వంభర, సూర్యాపేట: గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గ్రామ పంచాయతీ–సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPDP) కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో హుజూర్‌నగర్, సూర్యాపేట మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. రాబోయే మూడేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అలాగే జీ రామ్ జీ పథకం కింద అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించాలని, మహిళా సంఘాల వీఓ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/they-should-be-developed-as-model-villages/article-18518

Tags: