రాజ్‌కుమార్ హత్యాకాండ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన- డా. పట్నం మహేందర్ రెడ్డి
విశ్వంభర, షాబాద్:షాబాద్‌లో సంచలనం సృష్టించిన రాజ్‌కుమార్ హత్యాకాండలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. బాధితుల నివాసానికి వెళ్లిన ఆయన మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఉన్మాది రాజ్‌కుమార్ అమాయక చిన్నారులు, వృద్ధులను అత్యంత కిరాతకంగా హత్య చేయడం అత్యంత దారుణమైన, హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చ తెచ్చేవని ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత కుటుంబంలోని దివ్యాంగురాలు మేఘనను పరామర్శించిన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. మేఘనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఆమె వైద్యం, పునరావాసం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారని ఆయన వెల్లడించారు. అలాగే ఘటనపై నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీం భరత్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నాయకులు జడల రాజేందర్ గౌడ్, తమ్మలి రవీందర్, రామస్వామి, మాణిక్ రెడ్డి, అస్మత్ పాషా, ఉపసర్పంచ్ దండు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.