సైబర్, రహదారి భద్రతపై సాంకేతికతే కీలకం: సీపీ సజ్జనార్
విశ్వంభర, హైదరాబాదు : సైబర్ నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అన్నారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లో జరిగిన డిజిటల్ ట్రస్ట్ అండ్ సిటిజన్ ప్రొటెక్షన్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, మ్యూల్ ఖాతాలు, ఘోస్ట్ సిమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డిజిటల్ మోసాల నివారణపై పౌరుల అవగాహన హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం టీజీఐసీసీసీలో జరిగిన ఓఆర్ఆర్ రహదారి భద్రత సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్‌పై వాహనాలు నిలిచిపోతే వెంటనే 14449 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ, ఎఫ్‌టీసీసీఐ, సైబర్ క్రైమ్స్, ఎన్‌హెచ్‌ఏఐ, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.