గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గ్రామ పంచాయతీ–సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని రవి మహల్‌లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లోని సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను వినియోగించుకుని పంచాయతీల ఆదాయాన్ని పెంచేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ రాబోయే మూడు సంవత్సరాలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, గ్రామ సభల్లో ప్రజలు సూచించిన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లు, సామాజిక ఇంకుడు గుంటలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. జీ రామ్ జీ పథకం కింద ప్రతి అర్హ గ్రామీణ కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాల కోసం వీఓ భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.