హైదరాబాదు భూములను ఉద్యమకారులకివ్వాలి: జూపల్లి
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో కబ్జాకు గురవుతున్న భూములను గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలి అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి వారికి రావాల్సిన ఫలాలు అందేలా ముఖ్యమంత్రి వద్ద వారి డిమాండ్లను ప్రస్తావిస్తానని తెలిపారు. హైదరాబాదు ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక గద్దర్‌ను అవమానించడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. గత పాలకులు ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డులు, పింఛన్ తదితర హామీలను అమలు చేయాలని కోరారు. చివరి ఉద్యమకారుని గుర్తించే వరకు గుర్తింపు కమిటీ పనిచేస్తుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఉద్యమకారునికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని గుర్తింపు కెకె కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో: ఎండల ప్రదీప్ శ్రీనాథ్ ఎం.డి. రహీం బోరెల్లి సురేష్ నక్క మహేష్ సి. కృష్ణ రాములు నేత కురుపాటి సుదర్శన్ బొర్రా సురేష్ సుందర్ కృష్ణ గణేష్ తదితరులు పాల్గొన్నారు.