సొమ్ము ప్రజలది, సోకు నిర్వాహకులది
విశ్వంభర / చాంద్రాయణగుట్ట :-పాతబస్తీలో పేరుగాంచిన, కొంగుబంగారంగా కొలుస్తున్నా ఫలక్నుమా కాళీమాత దేవాలయంలో ఆదాయ పనుల పంపకాల్లో గొడవలు పోలీస్ స్టేషన్ గడప దగ్గర వరకు చేరుకున్నాయి. ఆలయ ఆదాయాన్ని ఆటోలో తీసుకెళ్తుండగా లాక్కోవడానికి ప్రయత్నించిన బాబాయిని చితకబాదిన ఆలయ పూజారి పవన్, పరస్పర ఫిర్యాదులు ఇద్దరిపై కేసులు నమోదు చేసిన చాంద్రాయణ గుట్ట పోలీసులు. ఓకే కుటుంబానికి చెందిన జగన్, రాజు, జగదీష్, జంగయ్య కాళీమాత ఆలయ నిర్వాహకులుగా కొనసాగుతున్నారు. జగన్ కుమారుడు బొల్లు జగన్ ఆలయ పూజారిగా ఉన్నాడు. అయితే వీరి మధ్య ఆదాయ వనరుల పంపకాలలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో గుడిలో వచ్చే ఆదాయాన్ని భాగాలుగా విభజించి పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆలయంలో వచ్చిన ఆదాయాన్ని వాలంటీర్, అంకిత్, నవీన్, ఆటోలో తీసుకెళ్తుండగా గమనించిన జంగయ్య వారి వద్ద లాక్కోవడానికి ప్రయత్నించారు, చేయి చేసుకున్నారు, వారి నుండి వారు తప్పించుకుని పారిపోయారు, విషయం తెలుసుకున్న పూజారి పవన్ జంగయ్య పై దాడి చేశాడు, ఈ విషయమై జంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయ వాలంటీర్లు అంకిత్, నవీన్లు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు కొన సాగిస్తున్నారు.