న్యూ శాయంపేట లో స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ప్రారంభం
విశ్వంభర, హనుమకొండ : హనుమకొండ న్యూ శాంపేట్ లో గురువారం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను వంద శాతం స్వచ్ఛంగా, దోషరహితంగా రూపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తహసీల్దార్ చాలమల్ల రాజు తెలిపారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తారని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, ఫోటోలు, ఇతర వివరాల సవరణ చేపడతారని వివరించారు. 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. ప్రజలంతా బీఎల్‌వోలకు సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు. హనుమకొండ న్యూ శాయంపేట 31వ డివిజన్‌లో కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్‌లో తాజా మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు పాల్గొని బీఎల్‌వోలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారు. డీసీసీ సభ్యులు మామిండ్ల సురేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రతి అర్హుడైన ఓటరును జాబితాలో చేర్పించేందుకు కట్టుబడి ఉందని,ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది. ఒక్క ఓటు కూడా వదిలిపెట్టకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడిని నమోదు చేయించే బాధ్యత తమ దా దన్నారు. బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించి, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సూపర్ వైసర్ సుదర్శన్ గారు , బీఎల్‌వో విజయ ,డివిజన్ అధ్యక్షుడు సురేందర్ , టిడిపి నాయకుల కుసుమ శ్యామ్, పాతిమచారి , కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.