ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర అభివృద్ధి: జిల్లా ప్రత్యేక అధికారి హరీష్
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా అమలైందని జిల్లా ప్రత్యేక అధికారి, జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, యువజన, మహిళా సంక్షేమం, డ్రగ్స్ నివారణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర 10 థీమ్‌లపై చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు. భూసార పరీక్షలు, పంట మార్పిడి, నానో యూరియా వినియోగం, సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సమాచారం అందించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనపై దృష్టి పెట్టాలని, టాస్క్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ ఫైళ్ల క్లియరెన్స్, పరిశుభ్రత, ఆరోగ్యం, రహదారి భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, పాఠశాలల అభివృద్ధి తదితర అంశాల్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల పురోగతిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.