ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు నమోదు కావాలి

  •   ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని సయ్యద్‌పల్లి గ్రామంలోని 249, 250  బూత్‌ల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి  ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది వంటిదని, ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని ఆ హక్కును పరిరక్షించుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అందజేయడంతో పాటు వాటిని సక్రమంగా నింపడంలో సహకరించాలని, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, చిరునామా మార్పులు, అవసరమైన సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు మరియు స్వయంగా ఫారమ్‌లు నింపలేని వారికి ప్రత్యేక సహకారం అందించి ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని సూచించారు.అలాగే బూత్ లెవల్ ఏజెంట్లు బూత్ లెవల్ అధికారులతో  సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితాలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఓటర్లకు ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉండాలని, ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తన వివరాలను ధృవీకరించుకోవాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి తండు అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-eligible-voter-must-be-registered-in-the-sir-process/article-17256

Tags: