11వ వార్డులో ఇంటింటి ఎస్‌ఐఆర్ ఫారాల పంపిణీ
విశ్వంభర , పరిగి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రారంభమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని సహకరించాలని పరిగి మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ ఎజాజ్ కోరారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో ఇంటింటి ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎజాజ్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బీఎల్‌ఓలకు సహకరించాలని కోరారు. బీఎల్‌ఓలు ప్రతి ఓటరు ఇంటిని మూడుసార్లు సందర్శించి వివరాలను సేకరిస్తారని తెలిపారు. బీఎల్‌ఏలు, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. అర్హులైన ప్రతి పౌరుడు తమ వివరాలను సక్రమంగా అందించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విజయవంతానికి తోడ్పడాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ లో ఏమైన ఇబ్బందులు వున్న ఎల్లవేళలు వార్డు లో అందుబాటులో వుండి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ సక్కు, బి ఎల్ ఏ లు నాగరాజు, అనిల్, కాలనీవాసులు పాల్గొన్నారు.