డయల్ యువర్ మహేశ్వరం ఎమ్మెల్యే కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ సమస్యలపై సబితా ఇంద్రారెడ్డికి వినతి

విశ్వంభర, బడంగ్ పేట్ :- మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన "డయల్ యువర్ మహేశ్వరం ఎమ్మెల్యే" కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ ప్రజల సమస్యలను కాలనీ ప్రతినిధులు వివరించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే చేసిన స్పందనను కాలనీవాసులందరూ వినాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, బడంగ్‌పేట్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, లార్డ్ స్కూల్ ఎదురుగా నెలలుగా డ్రైనేజీ నీరు లీకవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత ఏఈ స్పందించడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. దుర్వాసన, దోమల కారణంగా ప్రజలు, చిన్నారులు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే లార్డ్ స్కూల్‌లో చదువుతున్న సుమారు వెయ్యి మంది విద్యార్థులు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకుని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/sabitha-indra-reddys-plea-on-raghavendra-colony-issues-in-dial/article-17307

Tags: