ఓటరు సవరణపై అపోహలు వద్దు

ఓటరు సవరణపై అపోహలు వద్దు

  •  బీజేపీ సీనియర్ నాయకులు పొట్ట ఆంజనేయులు

విశ్వంభర, మేడ్చల్ : రాష్ట్రంలో జూన్ 25 నుండి ప్రారంభం అయిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని బీజేపీ సీనియర్ నాయకులు పొట్ట ఆంజనేయులు కోరారు. ఈ సవరణ కార్యక్రమం జూలై 24 వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొట్ట ఆంజనేయులు మాట్లాడుతూ, ఓటరు జాబితా నుండి అక్రమ ఓట్లను తొలగించడం ఎంత ముఖ్యమో, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడం అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. అవసరమైతే సవరణలు చేసుకోవాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం నియమించిన బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యుమరేషన్ పత్రాలను అందజేస్తారని తెలిపారు. ఆ పత్రాలను ఎలా నింపాలో తెలియని పక్షంలో అధికారులను అడిగి తెలుసుకొని జాగ్రత్తగా పూరించాలని సూచించారు. బీఎల్వోలు ఇచ్చే రెండు పత్రాలలో ఒకదానిని పూర్తిగా నింపి వారికి అందజేయాలని, రెండవ పత్రాన్ని రశీదుగా ప్రజలు తమ వద్దే భద్రపరుచుకోవాలని ఆయన వివరించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూసేందుకు, అపోహలకు తావివ్వకుండా ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని ఆంజనేయులు పిలుపునిచ్చారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/no-misconceptions-about-voter-amendment/article-17268

Tags: