ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల నిర్లక్ష్యమా
- తాగు నీరు లేక కాలనీ వాసుల అవస్థలు
- జలమండలి ముందు బైఠాయించి నిరసన
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో అనేక కాలనీలకు నీరు లేక కాలనీల ప్రజలు విలవిలలాడుతున్నా అధికారులు, ప్రభుత్వ నాయకులు పట్టించుకోవడం లేదు. చెంగిచెర్ల డివిజన్ నుండి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, బోడుప్పల్ డివిజన్ నుండి బిఆర్ఎస్ నాయకులు, సంఘసంస్కర్త సిగురు రేణుక రవికుమార్ గురువారం వివిధ కాలనీల ప్రజలతో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటూ బోడుప్పల్ డివిజన్ నుండి జలమండలి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి జలమండలి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని తమకు త్రాగునీరు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగడానికి నీరు లేక బోర్లు ఎండిపోయి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, నీటి కోసం జలమండలి అధికారులను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన పట్టింపు లేకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నరని తెలిపారు. జలమండలి అధికారులు కాలనీలకు త్రాగునీరు అందించడంలో విఫలమయ్యారనీ,ఇన్ని సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి కొరత రావడం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి నీరే ప్రాణాధారం అని అలాంటి మంచినీరు లేక గత కొంతకాలంగా బోడుప్పల్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తక్షణమే అధికారులు స్పందించి రోజు విడిచి రోజు నీరు అందించాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన జలమండలి మేనేజర్ మాట్లాడుతూ పైపు లీకేజీల కారణంగా సరఫరా ఆలస్యం అవుతుందని, కాలనీలు పెరిగిపోవడంతో అన్ని కాలనీలకు నీరు సరిపడటం లేదని, మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి ఒక గంట నీరును అందిస్తామని, అక్రమ నల్ల కలెక్షన్లు తొలగిస్తామని, లైన్ మేన్లతో విచారణ జరిపి ప్రతి కాలనీకి నీరు అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెలిఫోన్ కాలనీ, సూరజ్ నగర్ కాలనీ ఫేస్ వన్, ఫేస్ టు, మహాలక్ష్మి నగర్,అయోధ్య నగర్,మాత అరవింద కాలనీ,జై శ్రీరామ్ కాలనీ, ఇందిరా నగర్, గణేష్ నగర్, డబల్ బెడ్ రూమ్ కాలనీ,కనకదుర్గ ఫేస్1,2,3, ఏవిఆర్ కాలనీ, బాలాజీ నగర్ కాలనీల ప్రజలు, కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళలు పాల్గొని త్రాగునీరు అందించాలని జలమండలి అధికారులను కోరారు.