పోలియో రహిత సమాజమే ధ్యేయం. - కౌన్సిలర్ కోడి సుష్మ వెంకన్న

పోలియో చుక్కల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 

విశ్వంభర, చండూరు:- మున్సిపాలిటీ లోని ఏడవ వార్డులో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఏడవ వార్డు కౌన్సిలర్ కోడి సుష్మా వెంకన్న పాల్గొని మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో మనమందరం భాగస్వాములు కావడంలో ఐదు సంవత్సరముల లోపు పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి పిల్లల ఆరోగ్యం మన అందరి బాధ్యత అని గుర్తు చేస్తూ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న , కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, మోగుదాల సత్తెమ్మ, ఖలీల్, షరీఫ్, మోగుదాల వెంకన్న, స్థానిక పి హెచ్ సి డాక్టర్ మాస రాజు, ఏ ఎన్ ఎమ్ సౌజన్య, ఆశ వర్కర్ జ్యోతి, చేనగాని కిరణ్, మోబిన్ పాషా, ఫిరోజ్, రఫీ, నవీన్, రాము తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/polio-free-society-is-the-goal-councilor-kodi-sushma/article-17309

Tags: