ఓటరు జాబితా ప్రత్యేక సర్వే ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే ప్రక్రియను సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఇంటి ఇంటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఓటరుకు రెండు ఫారాలు అందజేయడంతో పాటు బీఎల్ఓలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఓటరు వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓకు తెలియజేసి సరిచేసుకోవాలని ప్రజలకు సూచించారు.
అలాగే, కావాలని తప్పుడు సమాచారం అందించిన వారి విషయంలో ఫారంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డిప్యూటీ తహసీల్దార్ లాలు, బీఎల్ఓ బంగారు పద్మ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.