జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడిగా నునావత్ మోహన్ నాయక్

విశ్వంభర, హుస్నాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన నునావత్ మోహన్ నాయక్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మార్గదర్శకత్వంలో, కేంద్ర  మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ సిఫార్సుతో రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు నేనావత్ రవికుమార్ ఈ నియామకాన్ని ప్రకటించారు. నియామకానంతరం మోహన్ నాయక్‌ను అక్కన్నపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా నునావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంతో పాటు జిల్లాలో గిరిజన మోర్చాను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. పార్టీ విస్తరణ, బూత్ స్థాయి నుంచి సంస్థాగత బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.తనపై విశ్వాసం ఉంచి ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి తదితర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపసర్పంచ్ అర్జున్ నాయక్, మాజీ సర్పంచులు మాలోత్ రాజ్‌కుమార్, సిహెచ్. కుమార్, మాజీ ఉపసర్పంచ్ వేముల ప్రసాద్, మహిళా మోర్చా నాయకులు మెడబోయిన స్వరూప స్వామి, కుంట సప్నారెడ్డి, నాయకులు జన్నారం కళ్యాణ్, కొండ్ల సంజీవరెడ్డి, రైనా నాయక్, పల్లె ప్రభాకర్ రెడ్డి, బొంకూరి రజనీకాంత్, జంగాపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nunawat-mohan-naik-as-district-tribal-morcha-president/article-17276

Tags: