తోల్కట్ట నిరుపేదల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ఎంపీ హామీ

విశ్వంభర,  మోయినాబాద్: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న "డయల్ యువర్ ఎంపీ" కార్యక్రమంలో తోల్కట్ట గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తోల్కట్ట శివశంకర్ గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఫోన్ ద్వారా మాట్లాడి గ్రామంలోని నిరుపేదల ఇండ్ల స్థలాల సమస్యను వివరించారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తోల్కట్ట గేట్ సమీపంలో పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినప్పటికీ, ప్రస్తుతం ఆ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతులు లభించడం లేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పట్టాలు పొందిన లబ్ధిదారులకు తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంపీ సానుకూల స్పందనపై తోల్కట్ట గ్రామ ప్రజల తరఫున శివశంకర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mp-promises-to-solve-the-problem-of-tolkatta-poor-houses/article-17280

Tags: