హలో బీసీ – చలో భువనగిరి పోస్టర్ ఆవిష్కరణ 

విశ్వంభర,  హుస్నాబాద్ : వచ్చే నెల జూలై 5 న నిర్వహించనున్న "హలో బీసీ – చలో భువనగిరి" కార్యక్రమానికి సంబంధించిన గోడ పోస్టర్‌ను హుస్నాబాద్ లో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, లక్ష్మీ ఫోటో స్టూడియో యాదగిరి మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాల హక్కులు, సమస్యలు, రిజర్వేషన్ల అంశాలపై అవగాహన కల్పించేందుకు "హలో బీసీ – చలో భువనగిరి" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు.దేశంలో సుమారు 140 కోట్ల జనాభాలో బీసీలు 65 శాతానికి పైగా ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లు అమలులో ఉండగా, బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, క్రిమిలేయర్ పరిమితిని రూ.15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిర్వహించనున్న బీసీ సింహగర్జన బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బీసీ ప్రజలు, యువత, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hello-bc-%E2%80%93-hello-bhuvanagiri-poster-launch/article-17287

Tags: